మీర్‌పేట్‌లో భారీ చిట్ ఫండ్ మోసం!

కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మీర్‌పేట్ (Meerpet) పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కాలనీలో మధ్య తరగతి ప్రజల నుంచి చిట్టీల పేరుతో ఓ జంట రూ.2 కోట్ల వరకు వసూలు చేసి పరారైన ఘటన చోటుచేసుకుంది. మీర్‌పేట్‌కు చెందిన సురేష్, అతని భార్య వెంకటసాయి చిట్‌ఫండ్స్ పేరుతో గత పదేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. 25 మందికి పైగా బాధితుల నుంచి రూ. 2 కోట్ల వరకు వసూలు చేశారు. ఒక్కొక్కరు రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వీరి వద్ద పెట్టుబడులు పెట్టారు.

ఈ విధంగా రూ.2 కోట్ల వరకు వసూలు చేసి పరారయ్యారు. చిట్టి గడువు ముగియడంతో బాధితులు నిర్వాహకులను డబ్బులు అడగగా.. చెక్‌లు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి కాలయాపన చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో బాధితులు మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో (Meerpet PC) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులు తమ డబ్బు తిరిగి ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: హార్దిక్ పాండ్యా ఒంటరి అయ్యాడు: మనోజ్ తివారి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>