Mobile Popup Ad
Mobile Popup Ad

అమ్రాబాద్ ఫారెస్ట్‌లో ఎన్ని పులులు ఉన్నాయంటే?

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (Amrabad Tiger Reserve) ఫారెస్ట్ ఏరియాలో మొత్తం 42 పులులు ఉన్నట్లు అఖిలభారత పులుల అంచనా (ఏఐటీఈ) కార్యక్రమంలో బహిర్గతమైంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఈ ఏడాది అటవీ శాఖ అధికారులు నిర్వహించిన సర్వేలో 42 పులులు ఉన్నట్లు లెక్కించారు. గత ఏడాది నవంబరు నుంచి ఈ ఏడాది జూన్ 20 వరకు 8 నెలల పాటు నిర్వహించిన సర్వేలో 32 పెద్ద పులులు ఉన్నట్లు, 10 చిన్న పిల్లలు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు లెక్కించారు. అందులో 18 ఆడ పులులు, 14 మగ పులులతోపాటు రెండు యుక్త వయసు గల పులి పిల్లలు, మరో 8 చిన్న పులి పిల్లలు ఉన్నట్లు సర్వే రిపోర్టు ద్వారా తెలిసింది. నాలుగు ఏళ్లకు ఒకసారి జరిగే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో అఖిల భారత పులుల అంచనా–2026 విజయవంతంగా పూర్తి చేసినట్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్ హిరేమత్, నాగర్ కర్నూల్ జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్రలు శనివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

2,611 చ.కి.మీ. విస్తీర్ణంలో సర్వే

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఈ సర్వే మొత్తం 2,611 చ.కి.మీ. విస్తీర్ణంలో చేపట్టినట్లు, సర్వేను క్రమబద్ధంగా నిర్వహించేందుకు రిజర్వ్‌ను 2 చ.కి.మీ గ్రిడ్‌లుగా విభజించి మొత్తం 1,120 ప్రాంతాల్లో 2,240 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ సర్వేను నాలుగు బ్లాక్‌లుగా నిర్వహించగా, ప్రతి బ్లాక్‌లో కెమెరాలు 30 రోజుల పాటు పని చేశావన్నారు. ఈ కార్యక్రమాన్ని ఫారెస్ట్ డివిజనల్ అధికారులు ,రేంజ్ అధికారులు, ఫీల్డ్ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ అటవీ సిబ్బంది చురుకుగా పాల్గొని విజయవంతం చేసినట్లు వారు తెలిపారు. అలాగే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జీవశాస్త్ర నిపుణులు, హైటికోస్ (Hyticos) స్వచ్ఛంద సంస్థ బృందం సాంకేతిక, పరిశోధనా సహకారం అందించిందని వారు తెలిపారు. ఈ కెమెరా ట్రాప్ సర్వే జాతీయ పులుల అంచనా కార్యక్రమంలో కీలక భాగంగా నిలిచి, పులుల సంఖ్య, వాటి వ్యాప్తి, ఆహార జంతువుల సమృద్ధి, నివాస ప్రాంతాల పరిస్థితులపై శాస్త్రీయ సమాచారాన్ని సేకరించడం జరిగిందన్నారు.

గత ఏడాది పులులు ఎన్నంటే?

పులి పిల్లలు, ఉప-వయోజన పులుల ఉనికి, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల విజయవంతమైన సంతానోత్పత్తి కొనసాగుతోందని, ఆరోగ్యకరమైన పులుల జనాభా ఉందని ఈ సర్వే వల్ల సూచిస్తోందని వారు పేర్కొన్నారు. ఈ అఖిల భారత పులుల అంచనా–2026 విజయవంతంగా పూర్తికావడం అటవీ అధికారులు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది, పరిశోధకులు, సంరక్షణ భాగస్వాముల సమిష్టి కృషికి నిదర్శనంగా నిలిచిందని వారు తెలిపారు. ఇది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణ, శాస్త్రీయ వన్యప్రాణి పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తుందన్నారు. గత ఏడాది నిర్వహించిన సర్వేలో 36 పులులు ఉండగా ఈ ఏడాది ప్రస్తుతానికి 42 పులులు ఉన్నట్లు లెక్క తేలిందని అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>