విద్య కాషాయీకరణపై AISF ఫైర్.. విద్యార్థులకు పోరాట పిలుపు

కలం, జోగులాంబ గద్వాల: మతోన్మాదానికి, విద్య కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఆంజనేయులు పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్‌లో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (AISF) 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా కమిటీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ (AISF) ఏపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బి. ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ఏఐఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. మతోన్మాద విధానాలకు, విద్య కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి హక్కుల సాధన కోసం, శాస్త్రీయ విద్యా విధానం అమలు కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం సమరశీల పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు. దేశంలో విద్య వ్యాపారంగా మారి పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యను దోపిడీకి మార్గంగా మార్చే విధానాలకు స్వస్తి పలికి, విద్యార్థులందరికీ ఉచితంగా, నాణ్యమైన విద్య అందించే విద్యా విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వంటి మహనీయుల ఆశయాల సాధన కోసం 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని తెలిపారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేస్తూ, నేటి వరకు సుమారు తొమ్మిది దశాబ్దాలుగా విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న గొప్ప చరిత్ర ఏఐఎస్ఎఫ్‌కు ఉందన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యా రంగంలో కాషాయీకరణను ప్రోత్సహిస్తూ, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధానాలను అవలంబిస్తోందని ఆంజనేయులు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు.

విద్యార్థులు ఎదుర్కొంటున్న హాస్టల్ సమస్యలు, విద్యారంగ సమస్యలు, విద్యా–ఉపాధి హక్కుల పరిరక్షణ కోసం “చదువుతూ పోరాడు – చదువుకై పోరాడు” అనే నినాదంతో ఏఐఎస్ఎఫ్ అనేక ఉద్యమాలు నిర్వహించిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.

అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పేరు కృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ లు, SC, St ఐక్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మోహన్, tpcc SC వైస్ చైర్మన్ మాల మహానాడు శ్రీనివాసులు, మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు రైల్వే పాషా, జిల్లా లైబ్రేరియన్ రామాంజనేయులు, ధరూర్ రవి, భరణి, శివ, రంగన్న, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పరమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు భరత్, జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, విద్యా హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థులందరూ ఐక్యమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ, ఉద్యమాలను బలోపేతం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు గంగాధర్, సురేందర్, గురుస్వామి, భీమరాజు, శివకుమార్, రాఘవేంద్ర, రమేష్, రాజు, శివ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>