epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అనిసిమోవా జోరు

కలం, వెబ్ డెస్క్ :  ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అమెరికన్ టెన్నిస్ స్టార్ అమాండా అనిసిమోవా (Amanda Anisimova) అద్భుతంగా ఆడుతుంది. శనివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో పేటన్ స్టీర్స్‌ (Peyton Stearns) ను ఓడించి ప్రీక్వార్టర్ ఫైనల్‌ కు చేరింది. తీవ్ర ఎండలో సాగిన ఈ మ్యాచ్‌ను నాలుగో సీడ్ అనిసిమోవా కేవలం 71 నిమిషాల్లో ముగించింది. మార్గరెట్ కోర్ట్ అరేనా (Margaret Court Arena) లో జరిగిన పోటీలో తొలి సెట్‌లో స్టీర్స్‌కు అవకాశం ఇవ్వలేదు. రెండో సెట్‌లో అనిసిమోవా సర్వ్‌లో స్వల్ప తడబాటు కనిపించడంతో స్టీర్స్ పోరాటం పెంచింది. అయినా కీలక సమయంలో అనిసిమోవా ధైర్యంగా ఆడి మ్యాచ్‌ను తనవైపు తిప్పుకుంది.

ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క సెట్ కూడా కోల్పోని అనిసిమోవా, క్వార్టర్ ఫైనల్ స్థానం కోసం లిండా నోస్కోవా (Linda Noskova) లేదా వాంగ్ జిన్యు (Wang Xinyu) తో తలపడనుంది. మెల్‌బోర్న్(Melbourne) పార్క్‌లోని మార్గరెట్ కోర్ట్ అరేనాలో అనిసిమోవా పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి సెట్‌లో ప్రపంచ ర్యాంక్ 68లో ఉన్న స్టీర్స్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 6-1తో సెట్‌ను కైవసం చేసుకుంది. రెండో సెట్‌లో అనిసిమోవా సర్వ్‌లో స్వల్ప తడబాటు కనిపించడంతో స్టీర్స్ పోరాటం పెంచింది. 5-1తో వెనుకబడ్డ ఆమె వరుసగా మూడు గేమ్స్ గెలిచి మ్యాచ్‌కు ఉత్కంఠ తీసుకొచ్చింది. ఈ సమయంలో అనిసిమోవా ఏడు డబుల్ ఫాల్ట్స్ చేసింది.

అయినా అనుభవం ఆమెకు విజయాన్ని దగ్గర చేసింది. చివరి దశలో ఇద్దరూ గట్టిగా పోరాడగా అనిసిమోవా (Amanda Anisimova) మ్యాచ్‌ను తన వైపుకు తిప్పుకుంది. మ్యాచ్ అనంతరం ఐస్ టవల్ చుట్టుకొని మాట్లాడుతూ, “ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది. ప్రేక్షకుల ముందే ఆడటం ఎంతో ఆనందంగా అనిపించింది.” అని ఆమె చెప్పింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క సెట్ కూడా కోల్పోని అనిసిమోవా, తొలి రౌండ్‌లో సిమోనా వాల్టర్‌ను 6-3, 6-2తో ఓడించింది. రెండో రౌండ్‌లో కటెరీనా సినియకోవాపై 6-1, 6-4తో విజయం సాధించింది.

Read Also: బంగ్లాదేశ్​కు ఐసీసీకి షాక్​.. వరల్డ్​ కప్ నుంచి ఔట్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>