కలం, వెబ్ డెస్క్ : టీ20 ప్రపంచ కప్ (T20 WC Cup)లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేసినట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధికారికంగా ప్రకటించింది. భద్రతా కారణాలను చూపుతూ, తమ ఆందోళనలను క్రికెట్ పాలక మండలి సరిగ్గా పరిష్కరించలేదని పేర్కొంటూ బంగ్లాదేశ్ ఐసీసీ ఈవెంట్ నుండి వైదొలగాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు శనివారం బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌తో భర్తీ చేస్తున్నట్లు ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాసింది. కాగా, బంగ్లాదేశ్, భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
Read Also: టి20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు వరుస దెబ్బలు
Follow Us On: Sharechat


