కలం, వెబ్ డెస్క్: 2026 సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నిలిచింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. సంక్రాంతి సెలవుల సీజన్‌లో బలమైన ఓపెనింగ్స్‌ను అందించడంలో చిరంజీవి తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం మెగాభిమానుల ఫోకస్ ‘విశ్వంభర’ (Vishwambhara)పై పడింది. అనేకసార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది పెద్ద టాస్క్‌గా మారింది.
అధిక బడ్జెట్, ఆలస్యం కారణంగా ఈ చిత్రం సెలవుల సమయంలో విడుదలైతేనే మంచి లాభాలను పొందగలదు. 2026 సమ్మర్ సీజ్ అయితే బాగుంటుందని మేకర్స్ సైతం భావిస్తున్నారు. విశ్వంభర ప్రధానంగా కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోవచ్చు. బలమైన ఓపెనింగ్స్ కోసం కనీసం ఐదు నుంచి ఆరు రోజుల సెలవులు అవసరం.
ఇక విజువల్ ఎఫెక్ట్స్ కూడా అతిపెద్ద ‘విశ్వంభర’ సవాలుగా మారింది. ఇది సినిమా ఆలస్యానికి కారణమవుతోంది. చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించడంతో.. OTT హక్కులను భారీ డిమాండ్ నెలకొంది. ఇదే ఊపులో ‘విశ్వంభర’ (Vishwambhara) మూవీని వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుందని మెగాభిమానులు భావిస్తున్నారు.
Read Also: టాలీవుడ్ లోకి మరో తెలుగమ్మాయి
Follow Us On: X(Twitter)


