epaper
Monday, January 26, 2026
spot_img
epaper

పరుగులు రాకపోయినా సంజూనే కొనసాగించాలి: రహానే

కలం, వెబ్ డెస్క్ : న్యూజిలాండ్‌ (New Zealand) తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ (Sanju Samson) బ్యాట్ మౌనంగా ఉన్నా.. అతడిపై నమ్మకం కోల్పోవద్దని అజింక్య రహానే (Ajinkya Rahane) సూచించాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో కూడా సంజూనే కొనసాగించాలని స్పష్టం చేశాడు. మూడో టీ20లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన సంజూ, తొలి రెండు మ్యాచ్‌ల్లో 10, 6 పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో అతడి స్థానంపై చర్చ మొదలైంది. తిలక్ వర్మ తిరిగొస్తే, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయాలి అన్న అభిప్రాయం అభిమానులలో వినిపిస్తుంది.

అయితే రహానే మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నాడు. “తిలక్ వర్మ (Tilak Varma) తిరిగొస్తే నా ఎంపికలో ఇషాన్ కిషన్ (Ishan Kishan) బయట కూర్చోవాలి. సంజూ శాంసన్ క్వాలిటీ ప్లేయర్. పరుగులు రాకపోయినా అతడినే బ్యాక్ చేస్తాను. మేనేజ్‌మెంట్ కూడా అదే చేస్తుంది” అని అన్నాడు. టీ20లో ప్రతి ఇన్నింగ్స్ అందంగా ఉండదని రహానే చెప్పాడు. “కొన్నిసార్లు ఆట అగ్లీగా కనిపిస్తుంది.. అది సాధారణం. 15 బంతుల్లో 25 పరుగులు ఇచ్చినా చాలు.. కొద్దిసేపు క్రీజ్‌లో ఉంటే ఫామ్ వస్తుంది” అని అభిప్రాయపడ్డాడు.

ఇషాన్ కిషన్ మాత్రం అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. రెండో మ్యాచ్‌లో 76 పరుగులు చేశాడు. మూడో టీ20లో 13 బంతుల్లో 28 పరుగులతో భారత్‌ను 10 ఓవర్లలోనే లక్ష్యానికి చేర్చాడు. భారత్ ఇప్పటికే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మిగిలిన మ్యాచ్‌లు ఎంపికలపై చర్చకు దారితీస్తున్నా అని రహానే (Ajinkya Rahane) తన మెసేజ్‌ను స్పష్టం చేశాడు. సంజూ శాంసన్‌కు ఇంకా సమయం ఇవ్వాలి.

Read Also: రూ.400కోట్ల డబ్బున్న కంటైనర్​ అపహరణ.. తిరుపతి లింక్​!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>