కలం వెబ్ డెస్క్ : తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే మేడారం(Medaram) జాతరలో ఓ నటి చేసిన పనికి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేడారం జాతరలో మొక్కులు చెల్లించుకోవడంతో భాగంగా భక్తులు ఎత్తు బంగారం పేరిట సమ్మక్క, సారలమ్మలకు బెల్లాన్ని తులాభారం వేసి సమర్పిస్తారు. ఇది ఏళ్ల తరబడి ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. తాజాగా హీరోయిన్ టీనా శ్రావ్య(Teena Sravya) కూడా అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించారు. కానీ, ఇక్కడ ఆమె తులాభారం వేసింది ఆమె కోసమో.. లేక కుటుంబసభ్యుల కోసమో కాదు.. ఆమె పెంపుడు కుక్క కోసం తులాభారం వేసి బెల్లం సమర్పించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు కుక్కకు తులాభారం వేయడం ఏమిటని ఫైర్ అవుతున్నారు. మేడారంలో ఇలాంటివి అనుమతించకూడదని అధికారులను కోరుతున్నారు.


