epaper
Monday, January 26, 2026
spot_img
epaper

పద్మశ్రీ పురస్కారం రావడం నా పూర్వజన్మ సుకృతం- రాజేంద్ర ప్రసాద్

కలం, సినిమా: కేంద్ర ప్రభుత్వం నాకు ‘పద్మశ్రీ’ (Padma Shri) పురస్కారాన్ని ప్రకటించడం నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఈ గౌరవం కేవలం నాకు మాత్రమే దక్కింది అని నేను అనుకోవడం లేదు. ఇది తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అన్నారు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad).

​ఈ సందర్భంగా నా మనసులోని మాట: ​కళలను గౌరవించి, నన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి (Central Govt), జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ​అసలు నేను ఈ స్థాయిలో నిలబడటానికి, ఈ అవార్డు అందుకోవడానికి ముఖ్య కారణం మీరే. 48 ఏళ్లుగా నేను ఏ వేషం వేసినా, ఏ ప్రయోగం చేసినా మీరందించిన ప్రేమే నాకు ఈరోజు ఇంతటి గుర్తింపు తెచ్చింది. ​నాలాంటి ఒక నటుడిని, మీ ఇంటి మనిషిలా ఆదరించి, “నటకిరీటి”ని చేసి, ఈ స్థాయికి తీసుకువచ్చింది మీ చప్పట్లే. ఆ ఋణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ​నన్ను ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండమని దీవించిన మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) తెలియచేశారు.

Read Also: ఆ ఉచిత పథకంపై వెంకయ్య నాయుడు అసంతృప్తి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>