బిగ్ రిలీఫ్.. సుడాన్ నుంచి వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్

కలం, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా ఎబోలా వైరస్ (Ebola Virus) తీవ్ర కల్లోలం సృష్టిస్తున్న వేళ సుడాన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఆ మహమ్మారి లక్షణాలు కనిపించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో లక్షణాలు కనిపించిన 35 ఏళ్ల అహ్మద్ ను వెంటనే గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ కు తరలించారు. అయితే తాజాగా అతడికి ఎబోలా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఈ మేరకు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ఈ ఫలితాలను వెల్లడించింది. ఈ క్రమంలోనే గాంధీ ఆసుపత్రి వైద్యులకు రిపోర్టు ఇచ్చింది. దీంతో వైద్యులు అతడిని డిశ్చార్చ్ చేయనున్నారు. సుడాన్ వాసి అహ్మద్ కి ఎబోలా నెగటివ్ అని తేలడంతో అతనితో కాంటాక్ట్‌లో ఉన్న మరో వ్యక్తిని కూడా డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>