తెలంగాణకు భారీ వర్ష సూచన..

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు (Telangana Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాలతో పాటు నాగర్‌కర్నూల్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనకరమైన వార్త అందించింది. రాగల రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించనున్నాయి. ఇవి రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయని, రుతుపవనాల రాకతో రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత (Heavy Rain) మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also: సహారా ఎడారిలో విషాదం: నీరు దొరక్క 49 మంది మృతి!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>