కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రామ్ నగర్ చౌరస్తా వద్ద శ్రీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఆగమన్ (Ramnagar Ganesh Aagman) కార్యక్రమంలో ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది. వినాయకుడి విగ్రహ ఆగమనాన్ని పురస్కరించుకుని ఆర్గనైజర్లు భారీగా ప్రచారం నిర్వహించడంతో, స్వామివారిని దర్శించుకోవడానికి నగర నలుమూలల నుండి వేలాది సంఖ్యలో భక్తులు, యువకులు తరలివచ్చారు.
కార్యక్రమం(Ramnagar Ganesh Aagman)లో భాగంగా నిర్వాహకులు భారీగా బాణాసంచా కాలుస్తూ, డీజే శబ్దాలతో హంగామా సృష్టించారు. భక్తుల రద్దీని నియంత్రించలేని పరిస్థితులు ఏర్పడటం, డీజే హోరు, పటాకుల మధ్య జనం ఒక్కసారిగా ముందుకు నెట్టుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదకరంలో ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన బద్రీనాథ్ అనే యువకుడు దుర్మరణం చెందాడు.
ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న ముషీరాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : పాక్‌ను ఊచకోత కోసిన భారత్.. 55కే ఆలౌట్!
Follow Us On: X(Twitter)

