ప్ర‌పంచ సుంద‌రిగా డొమినిక‌న్ భామ‌ జొహైరీ!

క‌లం, వెబ్‌డెస్క్: డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జొహైరీ మోలా మిస్ వరల్డ్ 2026 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. వియత్నాంలో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో 110 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. మిస్ వరల్డ్ 2025 విజేత, థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ.. జొహైరీ మోలాకు అందాల కిరీటాన్ని అలంకరించారు. స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రెయిన్స్ మొదటి రన్నరప్‌గా నిలవగా.. మలేసియాకు చెందిన టానుసియా చెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు. భారత్ తరఫున పోటీలో పాల్గొన్న నికితా పోర్వాల్ టాప్ 40 ఫైనలిస్టుల్లో చోటు దక్కించుకున్నారు.

జొహైరీ మోలా యూనివర్సిడాడ్ ఇబెరోఅమెరికానా నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పొందారు. ఆమె ‘వాయిసెస్ ఆఫ్ టుమారో’ అనే కార్యక్రమాన్ని స్థాపించి, ప్రస్తుతం దాని అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, యువతకు ఆంగ్ల భాషలో విద్యను అందిస్తూ వారి విద్యా, వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడుతున్నారు. సామాజిక సేవ పట్ల ఆమెకున్న నిబద్ధత కూడా మిస్ వరల్డ్ వేదికపై ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>