నేపాల్ వ‌ర‌ద‌లు.. బుర‌ద‌లో ప్రాణాల‌తో వృద్ధురాలు!

క‌లం, వెబ్‌డెస్క్: నేపాల్‌లో ఆక‌స్మిక‌ వ‌ర‌ద‌లు (Nepal Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ప‌ది రోజుల నుంచి గ‌ల్లంతైన వారి కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. తాజాగా ఓ ఇంటి శిథిలాల కింద బుర‌ద‌లో స‌హాయం కోసం ఎదురుచూస్తున్న ఓ వృద్ధురాలిని రెస్క్యూ టీమ్‌లు గుర్తించాయి. ప‌ది రోజులుగా అక్క‌డే సాయం కోసం ఎదురుచూస్తోంది. వెంట‌నే ఆమెకు నీళ్లు తాగించి, సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. నువాకోట్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఓ భ‌వ‌నం పూర్తిగా బుర‌ద‌లో కూరుకుపోగా నాలుగో అంత‌స్తులో వృద్ధురాలు బుర‌ద‌లో చిక్కుకుంది. రెస్క్యూ టీమ్‌లు వెళ్లేస‌రికి వృద్ధురాలు అప‌స్మార‌క స్థితిలో ఉన్న‌ట్లు తెలిపారు. ఆమెను హెలికాఫ్ట‌ర్‌లో సుర‌క్షిత ప్ర‌దేశానికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

మ‌రోవైపు నేపాల్ వ‌ర‌ద‌ల్లో (Nepal Floods) ఇప్ప‌టి వ‌ర‌కు 1340 మంది మృతి చెందారు. మ‌రో 5000 మందికి పైగా గల్లంత‌య్యారు. వీరిలో 600కు పైగా విదేశీయులే ఉన్నారు. గ‌ల్లంతైన వారి కోసం స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. నేపాల్‌లో ప‌రిస్థితులు ఇలా ఉండ‌గానే మ‌ళ్లీ వ‌ర‌ద హెచ్చ‌రిక‌లు రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Also Read : గణేష్ ఆగమన్ ఊరేగింపులో తొక్కిసలాట.. ఒకరు మృతి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>