కలం, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా ఎబోలా వైరస్ (Ebola Virus) తీవ్ర కల్లోలం సృష్టిస్తున్న వేళ సుడాన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఆ మహమ్మారి లక్షణాలు కనిపించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో లక్షణాలు కనిపించిన 35 ఏళ్ల అహ్మద్ ను వెంటనే గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ కు తరలించారు. అయితే తాజాగా అతడికి ఎబోలా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఈ మేరకు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ఈ ఫలితాలను వెల్లడించింది. ఈ క్రమంలోనే గాంధీ ఆసుపత్రి వైద్యులకు రిపోర్టు ఇచ్చింది. దీంతో వైద్యులు అతడిని డిశ్చార్చ్ చేయనున్నారు. సుడాన్ వాసి అహ్మద్ కి ఎబోలా నెగటివ్ అని తేలడంతో అతనితో కాంటాక్ట్‌లో ఉన్న మరో వ్యక్తిని కూడా డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు.

