లండ‌న్‌కు మీనాక్షి న‌ట‌రాజ‌న్‌.. ప‌ది నెల‌లు అక్క‌డే!

క‌లం, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ (Meenakshi Natarajan) సెప్టెంబ‌ర్ 13న లండ‌న్‌కు వెళ్ల‌నున్నారు. ఆమె 10 నెల‌ల పాటు అక్క‌డే ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌లో ఆమె ప‌ది నెల‌ల పాటు ఓ కోర్స్ చేసేందుకు అక్క‌డికి వెళ్తున్నారు. కోర్స్ పూర్త‌యిన త‌ర్వాత ఆమె తిరిగి రానున్నారు. అయితే అప్ప‌టి వ‌ర‌కు పార్టీ ఇంచార్జ్ బాధ్య‌త‌లు ఎవ‌రు చూసుకుంటార‌న్న దానిపై స్ప‌ష్ట‌త రాలేదు.

అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికే ఇంచార్జ్‌ బాధ్య‌త అప్ప‌గిస్తుంద‌న్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. రాష్ట్రంలో పార్టీకి ఇంచార్జ్ లేక‌పోతే సీఎం రేవంత్‌కు ప‌ట్టు పెరుగుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. అంతే కాకుండా రాష్ట్రంలో జ‌రిగే వ్య‌వ‌హారాల‌పై హైక‌మాండ్ జోక్యం కూడా త‌గ్గుతుంది. నిర్ణ‌యాలు, వాటి అమ‌లులో పూర్తి స్వాతంత్రం ఉంటుంద‌ని పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ న‌డుస్తోంది. అయితే ఇంచార్జ్‌గా మీనాక్షిని తొల‌గిస్తార‌న్న వార్త‌లు కూడా ప్ర‌చారంలో ఉన్నాయి. వీటిపై ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా ఎలాంటి స్ప‌ష్ట‌త రాలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>