కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత భార్య సునేత్రా పవార్ (Sunetra Pawar) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సమక్షంలో ఎలాంటి హడావిడి లేకుండా మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర ప్రమాణం చేశారు. ఆమె భర్త అజిత్ పవార్ మరణం తరువాత మహారాష్ట్ర సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
జనవరి 28న బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) మరణించిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ ఎన్సీపీలో కీలక నాయకుడిగా, మహాయుతి ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన మరణంతో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఖాళీ అయింది. దీంతో ఉపముఖ్యమంత్రి పదవిలో ఆయన భార్య సునేత్ర పవార్ (Sunetra Pawar) ను మహాయుతి కూటమి ఎంపిక చేసింది.
అంతకుముందు ఎన్సీపీ శాసన సభా పక్ష నేతగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమర్థించారు. సునేత్రా పవార్ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజిత్ మరణంతో బారామతి నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ స్థానంలోనే సునేత్ర పోటీ చేసే అవకాశముంది.
Read Also: నాకు చట్ట ప్రకారం నోటీసులివ్వలేదు.. మాజీ సీఎం కేసీఆర్ లేఖ..
Follow Us On: Sharechat


