కలం, ఖమ్మం బ్యూరో: హైదరాబాద్ మాదిరిగానే ఖమ్మంలో కూడా ఆస్పత్రులు, విద్యాలయాలు, ఇతర మౌళిక సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala) అన్నారు. ఖమ్మం అన్ని రంగాల్లో దూసుకుపోతుండటంతో ఆంధ్రోళ్లు కూడా ఇక్కడికి వస్తున్నారని అన్నారు. ఇతర జిల్లాల ప్రజలు కూడా ఖమ్మంలో స్థిరపడుతున్నారని మంత్రి తుమ్మల అన్నారు. శనివారం ఖమ్మంలో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఐదు లక్షలతో జనాభాతో ఖమ్మం శరవేగంగా విస్తరిస్తోందని, అందుకనుగుణంగా రహదారులు, తాగునీరు, సదుపాయాల కల్పన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
విద్యా, వైద్య సౌకర్యాలు రాష్ట్రంలో ఎక్కడావిధంగా ఖమ్మం (Khammam)లో ఉన్నాయన్నారు. స్వామి నారాయణ విశ్వవిద్యాలయం ఇక్కడే ఏర్పాటు చేశామన్నారు. మెడికల్ కాలేజీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుందని తుమ్మల అన్నారు. రహదారులు, డ్రైనేజీ ప్రధాన సమస్యలని గుర్తించి అమృత్ పథకం కింద రూ. 200 కోట్లు, యూజీడీ కింద రూ.250 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు.


