కలం, వెబ్ డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri)లో చిన్న మేడారం జాతరకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇది అసియాలోని అతిపెద్ద మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రతీకగా నిర్వహించే జాతర. ఇక్కడ కూడా భక్తులు సమ్మక్క, సారలమ్మ, నాగోబా దేవతలను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి దగ్గరగా ఉండటం వల్ల, భక్తులు స్వామి దర్శనంతోపాటు ఈ జాతరలో పాల్గొంటారు.
రాజపేట్ మండలం కురారం గ్రామంలో బుధవారం ప్రారంభమైన చిన్న మేడారం (Medaram) జాతర శనివారం ముగిసింది. భక్తులు పశువులు, బెల్లం అమ్మవార్లకు సమరించి మొక్కలు చెల్లించుకున్నారు. శనివారం చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ‘చిన్న మేడారం జాతర 30 సంవత్సరాలుగా జరుగుతోంది. కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నాం’ అని ఇక్కడి భక్తులు అభిప్రాయపడ్డారు. మేడారంకి వెళ్లలేని భక్తులు ఈ జాతరకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు.


