కలం, ఇంద్రవెల్లి: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Adilabad Collector) అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ తండా గ్రామంలో టీబీ రహిత గిరిజన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమగ్ర ఆరోగ్య పరీక్షా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించి సందర్శించారు. ఈ సందర్భంగా సమగ్ర ఆరోగ్య పరీక్షా శిబిర ప్రచార వాహనాలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం రోగులకు నిక్షయ్ మిత్ర కిట్ల(Nikshay Mitra Kits)ను పంపిణీ చేయడంతో పాటు, మెడికల్ ఆఫీసర్ సరస్వతిని అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘టీబీ ముక్త భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా పిరమల్ ఫౌండేషన్ సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా (ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ మండలాల్లో) మూడు బ్లాకుల్లో ఈ కార్యక్రమం ప్రారంభించబడుతున్నట్లు తెలిపారు.
అనంతరం గ్రామంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో కలెక్టర్ (Adilabad Collector) పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆయన సంప్రదాయ నృత్యం చేస్తూ స్థానికులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా.సాధన, అదనపు డీఎంహెచ్‌వో మనోహర్, డీఆర్డీవో రవీందర్, ప్రోగ్రామ్ అధికారి సుమలత, సర్పంచ్ రోహిదాస్, పిరమల్, స్టాప్ టీబీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు, ఎన్‌సీసీ కేడెట్లు, గ్రామస్థులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read : బీజేపీ చెత్త కుప్ప కాదు: మురళీధర్ రావు
Follow Us on : WhatsApp

