బీఆర్ఎస్ పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను మరింతగా పెంచి ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ (Nakrekal) పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతర రాజీవ్ గాంధీ స్టేడియంలో నిర్వహించిన ప్రజావికాస బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.

ఈ సభతో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఖిల్లా అని మరోసారి నిరూపితమైందన్నారు. వెయ్యిరోజుల్లో ఎన్నో పథకాలను అమలు చేశామని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అధికారంలో వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన.. మా రెండున్నరేళ్ల పాలనను బేరీజు వేసుకోవాలని రేవంత్ సూచించారు. వెయ్యి రోజుల్లో ఎన్నో పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. కానీ కొందరు దుర్మార్గులు తమ ప్రభుత్వం విఫలమైందని అంటున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : నకిరేకల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>