ఆందోళనకు కేటీఆర్ మద్దతు ఇవ్వాలి.. పోలాడి రామారావు విజ్ఞప్తి

కలం, కరీంనగర్: రాష్ట్ర రైతులకు, విద్యార్థులకు, వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు (Poladi Rama Rao) డిమాండ్ చేశారు. ఈమేరకు తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త రెడ్ల నిరసన దీక్షకు మద్దతు తెలుపాలని కరీంనగర్ కు వచ్చిన కేటీఆర్ కు విన్నవించారు. అందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారాని పోలాడి రామారావు మీడియాకు తెలిపారు. రాష్ట్ర రెడ్డి సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఈ నెల 8న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద వేలాది మందితో దీక్ష జరుగనున్నట్లు తెలిపారు.

ఈ సందర్బంగా నాయకులతో కలిసి పోలాడి రామారావు మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, బకాయిపడ్డ రూ. 9 వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలని, మెస్ చార్జీలు, స్కాలర్ షీప్ నిధులు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలు భర్తీ చేయాలని, పాలిటెక్నిక్ కళాశాలలను యదా విధంగా కొన సాగించాలని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ తక్షనమే రెడ్డి కార్పొరేషన్ కు రూ.1000 కోట్ల నిధులు కేటాయించి పాలక వర్గాన్ని తక్షణమే భర్టీ చేయాలన్నారు.

అలాగే మిగతా ఓసీ సామాజిక వర్గాల కార్పొరేషన్లకు సైతం నిదులు కేటాయించి పూర్తి స్థాయి పాలక వర్గాలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రామారావు కోరారు. ఎల్ నినో ద్వారా తలెత్తే కరువు సమస్యలు పరిష్కారానికి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న హైదరాబాద్ లో రెడ్డిసంఘాల రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే నిరసన దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓసీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డి సంపత్ రెడ్డి, రామంచ గోపాల్ రెడ్డి, గన్ను నర్సింహా రెడ్డి, వాల ప్రదీప్ రావు, రాజేందర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, శ్రీనివాస్ రమణారెడ్డి, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>