రేవంత్ అధికారం కట్ చేసేందుకు సిద్ధం: నిరంజన్ రెడ్డి

కలం, నాగర్ కర్నూల్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కరెంట్ కట్ చేసి కష్టాలకు గురి చేస్తోందని.. రేవంత్ రెడ్డి అధికారం కట్ చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనలో వైఫల్యాలపై నాగర్ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. వెలమ ఫంక్షన్ హాల్ నుంచి సబ్ స్టేషన్ వరకు రైతులు, ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టి, హౌజింగ్ బోర్డ్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు.

రేవంత్ రెడ్డిని నమ్మి..

ముఖ్య అతిథిగా పాల్గొన్న నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్ల వంటి బృహత్తర కార్యక్రమాలను అందించిన గొప్ప నాయకుడు అన్నారు. తాము అంతకంటే గొప్పగా ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పడంతో నమ్మి మోసపోయామని రైతులు బాధపడుతున్నారని అన్నారు. తెలంగాణ రైతుల పాలిట కాంగ్రెస్ సర్కార్ శనిలా మారిందని దుయ్యబట్టారు. రైతులకు నీరు ఇస్తే ఎరువులు, విద్యుత్తు, రైతు భరోసా, విత్తనాలు మద్దతు ధర ఇవ్వాల్సి ఉంటుందనే కుట్రపూరితంగా ఇవ్వలేదని ఆరోపించారు. కృష్ణా , గోదావరిలో వరద నీటిని ఎత్తిపోయాలని ఎంత మొత్తుకున్నా.. కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించిందని ఆరోపించారు.

మోటార్లు ప్రారంభించాలని చెప్పినా..

ఎగువన కర్ణాటకలో భారీ వర్షాలు పడటంతో కృష్ణా నదికి రోజు 1.50 లక్షల క్యూసెక్కుల వరద వవస్తోందని, కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లను ప్రారంభించాలని ఎంత చెప్పినా వినలేదని నిరంజన్ రెడ్డి విమర్శించారు. 200 రోజులు మోటార్లను నడిపి 40 టీఎంసీల నీరు ఎత్తిపోయడం సాధ్యం కాదని చెప్పినా.. పట్టించుకోలేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడిన ఆంధ్ర ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజూ 10 టీఎంసీల నీటిని తరలించకుపోతుంటే రేవంత్ సర్కార్ చూస్తూ ఉండిపోయిందన్నారు. పోతిరెడ్డిపాడుపై ఆధారపడి ఇటీవలే వెలిగొండ ప్రాజెక్టును ఏపీ ప్రారంభించుకుందని.. కానీ, తెలంగాణ ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోసుకుందామన్న సోయి సీఎంకు లేదన్నారను. రేవంత్ రెడ్డికి ఢిల్లీ పర్యటనలు తప్ప పాలనపై పట్టు లేదన్నారు.

మూడేళ్లలో చేసింది శూన్యం..

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ… 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 420 సీఎంగా నిలిచారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను తిట్టడం తప్ప ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మూడేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రతిపక్ష నాయకులను హేళన చేసేందుకేనా అధికారం ఇచ్చిందని ప్రశ్నించారు. తాము ఒక్క పిలుపు ఇస్తే 200 మంది రైతులు ట్రాక్టర్లతో స్వచ్ఛందంగా సబ్ స్టేషన్ ముట్టడికి వచ్చారని అన్నారు. షాపుల్లో లేని యూరియాను యాప్‌ల్లో నమోదు చేసుకోవడమంటేనే రైతులను మోసం చేయడమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు యూరియా ఇవ్వడానికి చేత కావడం లేదని మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>