కొండా సురేఖపై రిపోర్ట్ రెడీ.. సీఎం రేవంత్‌తో భట్టి కీలక భేటీ!

కలం, వెబ్ డెస్క్: మంత్రి కొండా (Konda Surekha) సురేఖకు సంబంధించిన వివాదంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలను క్రమశిక్షణా కమిటీ పరిశీలించింది. ఎమ్మెల్యేల అప్పీల్‌తో పాటు వరుసగా చోటుచేసుకున్న పరిణామాలపై కూడా కమిటీ సమగ్రంగా చర్చించింది. ఈ ఎపిసోడ్‌పై కమిటీ కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

క్రమశిక్షణా కమిటీ తరఫున ఎంపీ మల్లు రవి ఈ వ్యవహారంపై నివేదికను మీనాక్షి నటరాజన్, పీసీసీకి సమర్పించనున్నారు. క్రమశిక్షణా కమిటీ సభ్యులు వరుస రివ్యూలు చేసి కీలక నిర్ణయం తీసుకున్నారు. నివేదిక అంశంపై చర్చించేందుకు మల్లు రవి ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత  మల్లు రవి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా డిప్యూటీ సీఎం భట్టి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత వారం రోజులుగా జరిగిన పరిణామాలను భట్టి, సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ సాయంత్రానికి కొండా సురేఖ విషయంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>