కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) ఈ నెల 25వ తేదీన నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు వస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ నుంచి గవర్నర్ హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 10.20 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుంటారు. 11 గంటలకు పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆ తర్వాత జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో పసుపు రైతులతో ముఖాముఖి అవుతారు. మధ్యాహ్నం 1.50 గంటలకు డిచ్ పల్లి మండలం బర్దీపూర్-ధర్మారం శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో అర్వింద్ ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.20 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరిగి పయనం అవుతారు. ఈ మేరకు షెడ్యూల్ వెలువడింది.

