కలం, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి జిల్లా రామగుండం (Ramagundam) అయోధ్యనగర్‌లో ఎన్ఐఏ అధికారులు సోదాలు కలకలం రేపాయి. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్‌ను విచారించినట్లు సమాచారం. విద్యార్థి కదలికలు, సంబంధాలు, ఇతర అంశాలపై ఎన్ఐఏ ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది.
కృత్రిమ మేధ (ఏఐ) కోర్సు నేర్చుకోవడానికి రామగుండానికి చెందిన ముజామిల్ ఖాన్ పలువురిని సంప్రదించగా వాళ్ళు అతన్ని ఓ గ్రూపులో యాడ్ చేశారు. ఆ తర్వాత దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు నిర్వాహకులు అరెస్ట్ అయ్యారు. యువకుడు ఏడాది క్రితం గ్రూప్ లో యాడ్ కాగా.. గుజరాత్ నుంచి వచ్చిన ఎన్ఐఏ బృందం యువకుడి ఇంట్లో సోమవారం సోదాలు చేశారు.

