కలం, మెదక్ బ్యూరో: తల్లిదండ్రులను మత్తు ఇంజెక్షన్‌తో దారుణంగా హత్య చేసిన కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన యువతి, తిరిగి అదే తరహాలో మత్తు ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి (Sangareddy ) పట్టణంలో వెలుగుచూసింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ అనే యువతి, తన లవర్‌తో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారనే కోపంతో ఈ ఏడాది జనవరి 25న వారికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దారుణంగా హత్య చేసింది.
తన తల్లిదండ్రుల హత్యల కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సురేఖ, ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చి సంగారెడ్డి శాంతినగర్‌లోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో నివాసముంటోంది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను చంపేందుకు ఉపయోగించిన రకం మత్తు ఇంజెక్షన్‌నే స్వయంగా తీసుకుని హాస్టల్ గదిలోనే సూసైడ్ చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

