Mobile Popup Ad
Mobile Popup Ad

ములుగు ఫారెస్ట్రీ కోర్సు దరఖాస్తులు ప్రారంభం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి అటవీ కళాశాల అయిన సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (FCRI Mulugu) లో నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ (BSc Forestry) కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విద్యాసంవత్సరానికి గానూ మొత్తం 45 సీట్లను భర్తీ చేయనున్నారు.

ఇంటర్మీడియట్ పూర్తి చేసి, టీజీ ఈఏపీసెట్-2026 (TG EAPCET-2026) లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 25వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం, ఆన్‌లైన్ అప్లికేషన్ కొరకు కళాశాల అధికారిక వెబ్‌సైట్ http://fcrihyd.in ను సందర్శించవచ్చు. అటవీ శాస్త్రంపై ఆసక్తి ఉండి, ఈ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇదొక సువర్ణావకాశం.

Read Also: విదేశాలకు మన చేపలు.. కోహెడలో మెగా ప్రాజెక్ట్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>