కలం, వెబ్ డెస్క్ : రిపబ్లిక్ డే వేళ పేలుడు పదార్థాల పట్టివేత (Explosives Seized) కలకలం రేపింది. రాజస్థాన్ (Rajasthan)లోని నాగౌర్ లో పోలీసులు ఓ వ్యక్తి నుంచి 10 వేల కిలోల అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్గత సమాచారం ఆధారంగా నాగౌర్ ఎస్వోటీ పోలీసులు ఆదివారం నిందితుడి సులేమాన్ ఖాన్ (58) ఇంట్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భారీ పేలుడు పదార్థాలను కనుగొన్నారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేశారు.
నాగౌర్ ఎస్పీ వివరాల ప్రకారం.. 187 కాటన్లలో నిల్వచేసిన 10 వేల కిలోల అమ్మోనియం నైట్రేట్, తొమ్మిది కార్టన్ల డిటోనేటర్లు, 24 కట్టల విక్ వైర్ తో పాటు మరిన్ని పేలుడు పదార్థాలను సులేమాన్ తన పొలంలో దాచిపెట్టాడు. కాగా, నిందితుడిపై ఇప్పటికే మూడు పేలుడు పదార్థాల కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు నిల్వ చేయడం పెద్ద కుట్ర లో భాగం కావొచ్చని అనుమానిస్తున్నారు.
Read Also: చొరబాటుదారుడిని హతమార్చిన బీఎస్ఎఫ్..!
Follow Us On: X(Twitter)


