కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) జిల్లా హంటర్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. వరంగల్ ఫాదర్ ఆఫ్ కొలంబియాలో డాక్టర్ మమతా రాణి (33) అసిస్టెంట్ ప్రొఫసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న డాక్టర్ ను లారీ ఢీకొట్టింది. ఆమె 9 నెలల గర్భిణీ. ఈ ఘటనలో డాక్టర్ మమతా రాణి అక్కడికక్కడే మృతి చెందింది.


