కలం, వెబ్‌డెస్క్: అమెరికాలోని న్యూయార్క్ (New York) నగర 112 మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ (Zohraan Mamdani) ప్రమాణ స్వీకారం చేశారు. అర్ధరాత్రి వేళ, న్యూ ఇయర్ కొద్ది క్షణాల్లో వస్తుందనగా మాన్‌హట్టన్‌లోని ఓ సబ్వేలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రథమ పౌరుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మమ్దానీ ఖురాన్‌పై ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. భారతీయ మూలాలున్న జోహ్రానీ న్యూయార్క్ తొలి ముస్లిం మేయర్. ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఆయన విజయాన్ని అడ్డుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) స్వయంగా ప్రచారం నిర్వహించారు.
అయినా, ప్రజల మద్దతులో జోహ్రానీ మేయర్ పీఠం దక్కించుకున్నారు. పదవీ స్వీకారం అనంతరం జోహ్రాన్ మమ్దానీ (Zohraan Mamdani) మాట్లాడారు. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. న్యూయార్క్ వారసత్వంలో చారిత్రక, పురాతన ఓల్డ్ సబ్వే పాత్ర ఎంతో విశేషమైనదన్నారు. అనంతరం న్యూయార్క్ కొత్త రవాణా కమిషనర్‌గా మైక్ ఫ్లిన్‌ను నియమించారు. కాగా, మమ్దానీ ప్రమాణ స్వీకారం ఓ ప్రైవేట్ కార్యక్రమం. అధికారికంగా ఆయన కొత్త సంవత్సరంలో మరోసారి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
Read Also: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి
Follow Us On: Pinterest


