కలం, వెబ్ డెస్క్: ఓ ముగ్గురు హీరోయిన్లు హీరో ప్రభాస్‌పై (Prabhas) భారీ ఆశలు పెట్టుకున్నారు. ది రాజా సాబ్‌లో నటించడంతో తమ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ ప్రభాస్‌తో జోడీ కట్టారు. సరైన హిట్ కోసం నిధి అగర్వాల్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ’హరి హర వీర మల్లు ‘ మూవీ ఆమెను తీవ్రంగా నిరాశపర్చింది. ఆ సినిమా విజయం సాధించి ఉంటే, దాని సీక్వెల్‌లో పవన్ కళ్యాణ్ సరసన మరో అవకాశం వచ్చి ఉండేది. మూవీ డిజాస్టర్ కావడంతో అవకాశం చేజారిపోయినట్టయింది.
ఇక మాళవిక మోహనన్ ‘ది రాజా సాబ్’ తెలుగు (Tollywood) సినిమాతో అరంగేట్రం చేసింది. ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆమె కాస్ట్యూమ్స్, గ్లామర్, స్టేజ్ ప్రజన్స్ అందరినీ ఆకర్షించింది. అలాగే రిద్ది కుమార్ ప్రభాస్ మూవీపైనే భారీ ఆశలు పెట్టుకుంది. గతంలో ఈ బ్యూటీ ప్రభాస్‌తో (Prabhas) కలిసి ‘రాధే శ్యామ్’ సినిమాలో నటించింది. అది పరాజయం పాలైంది.
డైరెక్టర్ మారుతి ఈ ముగ్గురు హీరోయిన్లకు సమానంగా స్క్రీన్ స్పేస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాస్ (Prabhas) ముగ్గురు హీరోయిన్స్‌తో కలిసి ఓ స్పెషల్ సాంగ్ కూడా చేశాడు. స్టోరీలో భాగంగా ఈ ముగ్గురితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అయితే ఇద్దరు హీరోయిన్స్ మాత్రం మూవీలో కీలక పాత్రల్లో నటించారట. దాదాపు 500 కోట్లతో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ జనవరి 9న విడుదల కానుంది.
Read Also: వాయుసేన ఏవోసీ ఇన్ చీఫ్‌గా సీతేపల్లి శ్రీనివాస్
Follow Us On : WhatsApp


