కలం, వెబ్ డెస్క్: విదేశాల్లో మరో విషాదకరమైన ఘటన జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా తెలుగు విద్యార్థి (Telugu Student) చనిపోయాడు. హృతిక్ రెడ్డి అనే విద్యార్థి జర్మనీలో చదువుతున్నాడు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో తన అపార్ట్‌మెంట్‌లో ఆకస్మిక అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు దట్టంగా వ్యాపించడంతో ప్రమాదం నుంచి బయటపడేందుకు భవనంపై నుండి దూకాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించేలోపు హృతిక్ రెడ్డి చనిపోయాడు.
తెలంగాణలోని జనగాం జిల్లాలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి ఈ మరణించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. ఆయన జర్మనీ (Germany)లోని మాగ్డేబర్గ్‌లోని యూరప్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదువుతున్నాడు. తెలంగాణలో బ్యాచిలర్స్ పూర్తి చేసి 2023లో ఉన్నత విద్య కోసం జర్మనీకి వెళ్లారు. ఈ ఘటనతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని భారతదేశానికి తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.


