కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై (Amaravati Bill) చర్చ జరుగుతున్న వేళ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో తాము ఇచ్చిన ప్లాన్ ఏ ప్రభుత్వానికి నచ్చలేదని, మరో ప్లా బీ ప్రభుత్వానికి ప్రతిపాదించామని చెప్పారు. అమరావతికి లక్షల కోట్లు ఖర్చు చేసే బదులు అందులోని 10 శాతం నిధులతోనే మంచి రాజధానిని అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల మీదుగా అద్భుతమైన కారిడడార్‌ను నిర్మించవచ్చని చెప్పారు. మచిలీపట్నం (Machilipatnam) పేరులో నుంచి మా, విజయవాడ (Vijayawada) పేరులో నుంచి వి, గుంటూరు (Guntur) ఇంగ్లీష్ పేరులో నుంచి గన్ అనే అక్షరాలను తీసుకొని మావిగన్ (Mavigun) పేరుతో రాజధానిని అభివృద్ధి చేయవచ్చన్నారు. గన్ అంటే జగన్ గుర్తొస్తాడని అనుకుంటే వేరే పేరు పెట్టుకోవాలని సూచించారు.
చంద్రబాబు ఏళ్ల తరబడి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రజలను మభ్యపెడుతున్నారని జగన్ (YS Jagan) ఆరోపించారు. అమరావతి కోసం ఇప్పటికే కమిటెడ్ గ్రాస్ లోన్లు రూ.47 వేల కోట్లు ఎందుకు తీసుకన్నారని అన్నారు. దీంతో పాటు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎందుకు కేటాయింపులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని కోసం తీసుకొస్తున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గ్యారంటీ ఇస్తున్నారని నిలదీశారు. భూములు అమ్మి చంద్రబాబు (Chandrababu) డబ్బులు తీసుకొస్తానని చెప్పి, వేల కోట్లు అప్పులు చేసి ప్రభుత్వ ఖజానా పై భారం మోపుతున్నారని విమర్శించారు. చంద్రబాబు రాజధాని కోసం ఇప్పటి వరకు ఎన్ని భూములు అమ్మారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తన స్కాముల కోసం అమరావతి పేరు చెప్పి, అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముంచుతున్నారని ఆరోపించారు.
Read Also: సమంత హెల్త్ సీక్రెట్స్ ఇవే.. ఉదయాన్నే ఇవి పాటించేయండి!
Follow Us On : WhatsApp

