హనుమాన్ శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు : నిజామాబాద్ సీపీ

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ఈ నెల 02 న నిర్వహించే హనుమాన్ జయంతి, శోభాయాత్ర, అన్నదాన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Nizamabad CP Sai Chaitanya) కోరారు. బందోబస్తు కోసం నిజామాబాద్, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుండి టి.ఎస్.ఎస్.పి బెటాలియన్ పోలీస్ సిబ్బంది, 20 స్పెషల్ పార్టీలతో దాదాపు 1300 మందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో హనుమాన్ శోభాయాత్ర సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యాత్ర ప్రారంభం నుండి చివరి వరకు దారి పోడువున సి.సి కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, బైనాక్యూలర్లతో పర్యవేక్షణ ఉంటుందన్నారు.

కొత్తగా ఇంటర్సెప్టర్ వాహనం, పాత నేరస్తులపై పటిష్ట నిఘా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. అన్ని చోట్ల పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రారంభం నుండి ప్రశాంతంగా సాగేందుకు యాత్ర నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలన్నారు. యాత్రలో పాల్గొనే ప్రజలు నిబంధనల ప్రకారం నడుచుకొని పోలీసులకు సహకరించాలని విన్నవించారు. శోభా యాత్రను శాంతియుతంగా జరుపుకోవడం అందరికి శ్రేయస్కరమని, ఎలాంటి రూమర్లును నమ్మవద్దని, ప్రతిఒక్కరు స్నేహభావంగా ఉండాలని సీపీ (Nizamabad CP) కోరారు.

Read Also: రేపు మద్యం షాపులు బంద్ .. ఉత్తర్వులు జారీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>