కలం, వెబ్ డెస్క్: నటి సమంత (Samantha) సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. అంతకంటే తన రోజువారి అలవాటపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. తన లైఫ్‌ను మార్చేసిన ఉదయపు అలవాట్లను (Morning Habits) అభిమానులతో పంచుకున్నారామె. ఉదయం నిద్రలేవగానే చేసే పనులు ఆ రోజంతా మానసిక స్థితిని, శక్తిని ప్రభావితం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా నిద్రలేచిన మొదటి గంట సేపు ఫోన్‌కు దూరంగా ఉంటుంది. కనీసం ఐదు నిమిషాలపాటు ప్రశాంతంగా శ్వాస వ్యాయామాలు చేస్తుంది. దీని వల్ల నాడీ వ్యవస్థ శాంతించి, ఒత్తిడి తగ్గుతుందని వివరించింది. ఈ చిన్న మార్పులు బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి, చర్మ సమస్యలకు చెక్ పెట్టడానికి సహాయపడతాయని సమంత తెలిపారు.
సమంత (Samantha) తన రొటీన్ లైఫ్‌లో భాగంగా ఉదయాన్నే సూర్యరశ్మిలో కొద్దిసేపు గడుపుతారు. అలాగే మెడిటేషన్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఉదయం 11 గంటల లోపు వ్యాయామం పూర్తి చేయడం, బ్రేక్‌ఫాస్ట్ తర్వాతే కాఫీ, టీ తీసుకోవడం వంటి నియమాలను సమంత పాటిస్తుంది. ఈ సూత్రాల పవర్ మార్నింగ్ రొటీన్‌ను కనీసం 21 రోజులపాటు క్రమం తప్పకుండా పాటిస్తే జీవితంలో అద్భుతమైన మార్పులను గమనించవచ్చని సమంత తన అనుభవాలను షేర్ చేసుకున్నారు.
Read Also: మెదడు క్లీన్ కావాలంటే ఈ పని చేయండి.. స్టడీలో షాకింగ్ నిజాలు
Follow Us On: Instagram

