Mobile Popup Ad
Mobile Popup Ad

‘హీరో కాకపోయినా నేను రెడీ!’.. ఎమ్మెల్యేకు రామకృష్ణ కౌంటర్

కలం, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అత్యధిక డ్రగ్స్ యాక్టివిటీ జరిగేది సినిమా ఇండస్ట్రీలోనని, సినిమా యాక్టర్లందరూ ప్రతి 90 రోజులకోకసారి డ్రగ్స్ టెస్టు తప్పకుండా చేయించుకోవాలని.. డ్రగ్స్ టెస్టు తర్వాతే సినిమా రిలీజ్ కండీషన్ పెట్టాలని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు డ్రగ్స్ టెస్టు చేయించుకోకపోతే యాక్టర్లు డ్రగ్స్ తీసుకున్నట్టేనని తెలిపారు. అయితే తాజాగా అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) చేసిన వ్యాఖ్యలకు విలక్షణ నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

మేము సిద్ధం.. మీరు సిద్ధమా?

తాను పెద్ద హీరోని కాకపోయినా డ్రగ్స్ టెస్టుకు సిద్ధమని .. అయితే ప్రతి ఆదివారం రాజకీయ నాయకులు సైతం ‘లై డిటెక్టర్’ టెస్టులు చేయించుకోవాలని రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) అన్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై జీవో జారీ చేయాలని కోరారు. 90 రోజులకోసారి కాకుండా.. ప్రతి ఆదివారం తాము డ్రగ్స్ టెస్టు.. రాజకీయ నాయకులు ‘లై డిటెక్టర్’ టెస్టులు చేసుకుందామని పిలుపునిచ్చారు. అప్పుడే మీ మాట.. మా మాట.. నమ్మి ప్రజలందరూ అభివృద్ధి చెందుతారని వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. మరి రాహుల్ రామకృష్ణ వ్యాఖ్యలపై అనిరుధ్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

రాహుల్ రామకృష్ణ సినీ కెరియర్..

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాహుల్ రామకృష్ణ నటుడితో పాటు రచయిత , విలేకరి కూడా. సైన్మా అనే షార్ట్ ఫిలిమ్ తో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రాహుల్ రామకృష్ణ .. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో స్నేహితుడు పాత్ర తో మంచి గుర్తింపు పొందారు. సమ్మోహనం, భరత్ అనే నేను, ఇంటలిజెంట్, జయమ్ము నిశ్చయమ్మురా, హుషారు, బ్రోచేవారెవరురా, అలా వైకుంఠపురంలో, విరాటపర్వం, అంటే సుందరానికి , ఇంటింటి రామాయణం, ఓం భీమ్ బుష్, ఆంధ్ర కింగ్ తాలూకా వంటి పలు చిత్రాలలో నటించి మెప్పించారు.

Read Also: సమంత హెల్త్ సీక్రెట్స్ ఇవే.. ఉదయాన్నే ఇవి పాటించేయండి!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>