కార్పొరేట్‌‌కు దీటుగా నల్లగొండ ప్రభుత్వ పాఠశాల.. అడ్మిషన్స్ ఫుల్

కలం, వెబ్ డెస్క్: రాజకీయాలకతీతంగా నల్లగొండ (Nalgonda) జిల్లా అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ఆయన భారీగా నిధులు కేటాయిస్తూ ఎడ్యుకేషన్ వ్యవస్థను బలోపతం చేస్తున్నారు. తన దివంగత కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి స్మారకార్థం జిల్లాలోని అనేక ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నారు. విద్యార్థులకు కనీస వసతులైన తాగునీరు, ఆధునిక తరగతి గదులు, ప్రహరీ గోడలు, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆయన ముందుకుసాగుతున్నారు.

నల్లగొండ ప్రభుత్వ పాఠశాలకు డిమాండ్

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దితే ఆదరణ ఎలా పెరుగుతుందని నల్గొండ ప్రభుత్వ పాఠశాల (Nalgonda Govt Schools) నిరూపించింది. మంత్రి కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) సొంత ఖర్చుతో మెరుగైన మౌలిక వసతులు కల్పించారు. దీంతో ఇక్కడ సీట్ల కోసం పేరెంట్స్ క్యూ కడుతున్నారు. నాణ్యమైన విద్య, వసతులు కల్పిస్తే ప్రజలు సర్కారీ బడులకే మొగ్గు చూపుతారని ఈ మార్పు స్పష్టం చేస్తోంది. ఈ ప్రభుత్వ పాఠశాల ప్రతి ఏడాది మంచి ఫలితాలు సాధిస్తుండటంతో చాలామంది ఇక్కడ చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Read Also: మణిపూర్‌లో మరోసారి హై టెన్షన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>