మొంథా తుపాను(Cyclone Montha) కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిందని మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) పేర్కొన్నారు. తమ హయాంలో ఆర్బీకేల వ్యవస్థ అప్రమత్తంగా ఉండేదని, ప్రతి పంటకూ ఈ-క్రాస్ చేసేవాళ్లమని తెలిపారు. తమ ప్రభుత్వం తెచ్చిన ఉచిత పంటల బీమాతో రైతులకు భరోసా ఉండేదన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని, ఇన్‌పుట్ సబ్సిడీ లేదు, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని పేర్కొన్నారు. ఇవన్నీ మానవ తప్పిదాలని ఆరోపించారు. ఈ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మొంథా’ ముమ్మాటికీ చంద్రబాబు సృష్టించిన విపత్తేనని అన్నారు.
‘‘మొంథా తుఫాన్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 11 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ దెబ్బతిన్నది’’ అని జగన్(YS Jagan) అన్నారు.
ఇదిలా ఉంటే తుఫాన్ ప్రభావం, పంట, ఆస్తి నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. 5 రోజుల్లోగా పంటనష్టంపై నివేదిక అందించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తుపాన్ వల్ల జరిగిన పంటనష్టంపై సర్కార్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. వరి, పత్తి, మొక్కజొన్న, అరటి ఇతర ఉద్యానవన పంటలు భారీగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.
Read Also: ఫ్రెండ్ ఇంట్లో మహిళా డీఎస్పీ చోరీ..

