epaper
Monday, November 17, 2025
epaper

మెదడుకు మేలైన ఆహారం ఏంటో తెలుసా..!

శరీరం ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి అంటే ఏం తినాలి? ఏం చేయాలి? అంటే దాదాపు అందరికీ ఒక ఐడియా ఉంటుంది. కానీ, మన మెదడు ఆరోగ్యంగా(Brain Health), చురుగ్గా ఉండాలంటే ఏం తినాలి? అంటే చాలా మంది ఆలోచనలో పడతారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో మార్పు, వ్యాయామం చేయాలని తెలిసినా.. ఆ శరీరాన్ని నడిపే మెదడు ఆరోగ్యం గురించి చాలా మందికి పెద్దగా తెలీదు. అనేక మంది మెదడు ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా తమ శరీరంతో పాటు మెదడుకు మేలు చేసే ఆహారాన్ని కూడా రోజూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనం తీసుకునే ఆహారం మన శరీర ఆరోగ్యాన్నే కాదు.. మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. అందుకోసం గంటల తరబడి కష్టపడి వంటలు చేసుకోవాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. మరి ఆ ఆహారాలు ఏంటో తెలుసా..

టీ, కాఫీ

అవును.. టీ, కాఫీలు మన మెదడుపై మంచి ప్రభావం చూపుతాయి. వీటిని అధికంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కానీ, వాటిని మితంగా తీసుకుంటే మాత్రం మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. రోజుకు నాలుగు కప్పులకు మించి టీ, కాఫీలు తాగడం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు.

కోడి గుడ్లు..

కోడిగుడ్లలో విటమిన్ బీ, కోలిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీ విటమిన్ లోపం కారణంగా డిప్రెషన్ ప్రమాదం పెరుగుతుంది. మానసిక స్థితి, జ్ఞాపకశక్తికి బాధ్యత వహించే న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేయడానికి శరీరానికి కోలిన్ అవసరం. అది కోడిగుడ్లలో లభిస్తుంది. రోజూ గుడ్డును తినడం వల్ల మన శరీర ఆరోగ్యంతో పాటు మెదడు ఆరోగ్యం(Brain Health) కూడా మెరుగుపడుతుంది.

పండ్లు..

పండ్లు తినడం వల్లే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అందరికీ తెలుసు. అందులో నారింజ, క్యాప్సికమ్, జామ, కివి, టొమాటో, స్ట్రాబెర్రీ వంటి కొన్ని పండ్లలో విటమిన్ “సి” అధిక మొత్తంలో ఉంటుంది. విటమిన్ “సి” మెదడు కణాలకు నష్టం జరగకుండా చేస్తుంది. బ్లూబెర్రీస్ తినడం వల్ల మెదడుకు చాలా మేలు జరుగుతుంది. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్లూబెర్రీస్ మెదడును యాక్టివ్ గా ఉంచుతూ వృద్ధాప్యాన్ని రానీయకుండా ఉంచడమే కాకుండా, నరాలకు సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి..

గుమ్మడికాయ గింజలు

గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే జింక్, మెగ్నీషియం, కాపర్, ఐరన్ ఉన్నాయి. నరాలకు సంకేతాలను ప్రసారం చేయడానికి జింక్, జ్ఞాపకశక్తికి మెగ్నీషియం, నరాల సంకేతాలను నియంత్రించడానికి కాపర్, బ్రెయిన్ ఫాగింగ్ను నివారించడానికి ఐరన్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Read Also: నాణ్యమైన నిద్ర అంటే గంటల తరబడి పడుకోవడం కాదు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>