మాస్ మహారాజా రవితేజ(Ravi Teja).. తన లెటెస్ట్ మూవీ ‘మాస్ జాతర(Mass Jathara)’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం మన మాస్ హీరో.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటిలో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన రిటైర్మెంట్‌పై కూడా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవిని ఇన్‌స్పిరేషన్ తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చానని అన్నాడు. దాంతోపాటుగా మూవీ ఆలస్యంపై కూడా మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఇదే మొదటిసారి అని అన్నాడు. ‘‘ఈ సినిమా షూటింగ్‌లో కొన్ని గాయాలయ్యాయి. వాటి వల్లే సినిమా చాలా సార్లు వాయిదా పడింది. అసలు సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఆ తర్వాత వేసవిలో రావాలనుకున్నాం. వినాయక చవితి వద్దామనుకున్నాం. అవేవీ కుదరలేదు. ఇప్పుడు వస్తున్నాం. నా కెరీర్‌లో ఏ సినిమా ఇంత లేట్ కాలేదు. ఇది ఫస్ట్ టైమ్’’ అని అన్నాడు.
‘‘నేను గెలుపోటములను ఎప్పుడూ పట్టించుకోను. చేసే పనిని వందశాతం మనసుపెట్టి చేస్తా. యంగ్ జనరేషన్‌కు ఇచ్చే సలహా కూడా అదే. ఫలితం గురించి మర్చిపోయి చేసే పనిపైనే దృష్టి పెట్టు. నువ్వు చేసిన కష్టానికి తగిన ఫలితం రావాల్సిన సమయంలో వస్తుంది. ఆత్మవిశ్వాసం తగ్గితే ఏం సాధించలేం. అన్నికంటే నమ్మకం ముఖ్యం. నటన నుంచి నేను రిటైర్మెంట్ తీసుకోను. నా చివరి శ్వాస వరకు సెట్స్‌లోనే ఉంటా. సోషల్ మీడియాలో వచ్చే ఏ ట్రోల్స్ నన్ను ప్రభావితం చేయలేవు’’ అని Ravi Teja చెప్పారు.
Read Also: అవార్డ్‌లు కొనుక్కోవడంపై అభిషేక్ క్లారిటీ..

