అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ..!: వైఎస్ జగన్

కలం, వెబ్ డెస్క్ : పార్లమెంట్ లో అమరావతి (Amaravati) ఏపీ రాజధాని గా చట్టబద్దత కల్పిస్తున్న వేళ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి సహా ఏ ప్రాంతానికి వైసీపీ వ్యతిరేకం కాదని జగన్ స్పష్టం చేశారు. అసలు రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని అని ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని కేవలం ప్రభుత్వం ఇష్టమన్న జగన్.. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం పాత్ర ఉండదని స్పష్టం చేశారు. అందుకే అమరావతికి చట్టబద్దత బిల్లు అవసరం లేదని పేర్కొన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉండడం దురదృష్టకరం..

చంద్రబాబు (Chandrababu) వంటి నాయకుడు ఏపీకి సీఎం ఉండటం దురదృష్టకరమని, ఆయనకు చిత్తశుద్ధి, నిజాయితీ లేదని ఆరోపించారు. దోపిడీ చేయడమే చంద్రబాబు పని అని, అమరావతికి చట్టబద్ధత బిల్లు (Amaravati Bill) విషయంలోనూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.”రాజధానిలో లక్ష ఎకరాల్లో మౌలిక వసతులకు రూ. 2 లక్షల కోట్లు కావాలి. బహుబలి సెట్టింగ్ చూపించి మాస్టర్ ప్లాన్ గీశారు. వీళ్ల మాస్టర్ ప్లాన్ ను వీళ్లే ఎందుకు మార్చారు 50వేల ఎకరాలతో వరల్డ్ క్లాస్ సిటీ అని మీరే చెప్పారు. ఇప్పుడు లక్ష ఎకరాలు కావాలని ఎందుకు అంటున్నారు. ఈ ప్రశ్నలకు అసెంబ్లీలో సమాధానం చెప్పారా? వైసీపీ దుమ్మెత్తిపోయడానికే అసెంబ్లీ పెట్టారు” అని వ్యాఖ్యానించారు.

దేశంలో అతిపెద్ద స్కామ్ ..

దేశంలో అతిపెద్ద అవినీతికి అమరావతిని రాజధాని చేశారని మాజీ సీఎం జగన్ (YS Jagan) విమర్శలు గుప్పించారు. ”ఫైవ్ స్టార్ రేంజ్ నిర్మాణాల్లో కూడా SFT నిర్మాణ ఖర్చు రూ.4 వేల 500 .. అమరావతిలో నిర్మాణ ఖర్చు రూ. 14వేలకు పెరిగింది. హైదరాబాద్, చెన్నై , బెంగళూరులో కూడా ఇంత రేటు లేదు. గతంలో టెండర్లు పొందిన వాళ్లకే మళ్​లీ టెండర్లు ఇచ్చారు. రేట్లు పెంచి మరీ టెండర్లు ఇచ్చారు. కాంట్రాక్టర్లకు రాయితీలు, మినహాయింపులు ఇచ్చారు. ఇది స్కామ్ కాకపోతే మరేంటి?.అమరావతిలో ఆర్గనైజ్డ్ గా అవినీతి, స్కామ్ జరుగుతోంది. వీళ్ల దోపిడీకి వీరప్పన్ కూడా సరిపోడు” అని మండిపడ్డారు.

ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే డ్రామా..

అమరావతి స్కామ్ లో ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే రాజధానికి చట్టబద్దత అంటూ చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. చట్టబద్ధత కోసం ఏ అసెంబ్లీలో తీర్మానం చేశారో.. అదే అసెంబ్లీలో రాజధాన మార్పుకోసం తీర్మానం చేయలేరా? అని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా చట్టం చేయగలదు. చట్టాన్ని మార్చగలదని స్పష్టం చేశారు. ఇవన్నీ తెలసి కూడా డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏడేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేమిటి?. భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా? అని ప్రశ్నలు గుప్పించారు.

Read Also: బ్లాక్‌డే వద్దు.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దినంగా పరిగణించాలి: రఘురాం రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>