Mobile Popup Ad
Mobile Popup Ad

అభిమాని కోరిక.. సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వంపై అభిమానంతో బోయ మంజునాథ్ (Boya Manjunath) అనే యువకుడు హిందూపురం నుంచి సైకిల్ యాత్ర చేపట్టి అమరావతికి చేరుకున్నారు. సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబు (Chandrababu)ను కలిసి తన సైకిల్ యాత్రను గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలకు మద్ధతుగా సైకిల్ యాత్ర చేపట్టానని సీఎంకు తెలిపారు. మైనర్ బాలికలపై లైంగిక దాడులు, వేధింపుల నుంచి రక్షణ కోసం తీసుకొచ్చిన పోక్సో చట్టంపై రాష్ట్రంలో మరింత ప్రచారాన్ని కల్పించడంతో పాటు చైతన్యాన్ని తీసుకురావాలని సీఎంను కోరారు. మహిళల పట్ల గౌరవాన్ని కలిగి ఉన్న మంజునాథ్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు. అనంతరం మంజునాథ్ కోరిక మేరకు సీఎం సైకిల్‌ తొక్కారు.

Read Also: ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతి: పెమ్మసాని చంద్రశేఖర్‌

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>