బ్లాక్‌డే వద్దు.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దినంగా పరిగణించాలి: రఘురాం రెడ్డి

కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత సందర్భంగా లోక్ సభలో చర్చ రసవత్తరంగా సాగింది. సభలో కాంగ్రెస్ ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి (Raghuram Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని లోక్ సభలో స్పష్టం చేశారు. ఏపీ విభజన చట్టంలో తెలంగాణకు పలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్ఐటీ, ఐఐఎం వంటి విద్యా సంస్థలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారని గుర్తు చేశారు. ఆదిలాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ వంటి వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. బయ్యారం స్టీల్‌ ప్లాంటు (Bayyaram Steel Plant) ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఇప్పటికి ఏర్పాటు చేయలేదన్నారు. ఇలా తెలంగాణకు ఇచ్చిన చాలా హామీలు అమలు కాలేదని అన్నారు.

ఏపీకి అదనపు నిధులు ఇవ్వడంపై తెలంగాణకు అభ్యంతరం లేదని రఘురాం రెడ్డి (Raghuram Reddy) స్పష్టం చేశారు. ఏపీ తరహాలోనే తెలంగాణకు అదనపు నిధులు (Additional funds) ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం, ఆదిలాబాద్‌ విమానాశ్రయాలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలన్నారు. హైదరాబాద్ లో రీజినల్‌ రింగ్‌ రోడ్డు, కేటీపీఎస్‌ (KTPS) విస్తరణకు కేంద్రం సహకరించాలని కోరారు. ఏపీలో కలిపిన వాటిలో 4 గ్రామ పంచాయతీలను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ 4 గ్రామ పంచాయతీలు ఏపీ, తెలంగాణలో ఎక్కడ ఉన్నాయో ఉనికిలో లేవని చెప్పారు. భద్రాచలం నియోజకవర్గంలోని 4 గ్రామ పంచాయతీలను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూన్‌ 2వ తేదీని బ్లాక్‌డే పరిగణించవద్దని ఏపీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. జూన్‌ 2వ తేదీని రెండు రాష్ట్రాల అభివృద్ధి దినంగా పరిగణించాలని సూచించారు.

Read Also: వస్తున్నాం లింగమయ్యా.. నేటి నుంచే నల్లమల ‘సలేశ్వరం’ జాతర

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>