అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టిన నిత్యానందరాయ్

కలం, వెబ్ డెస్క్: దేశ రాజధానికి ఢిల్లీలోని లోక్ సభలో బుధవారం చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ (Nityanand Rai) అమరావతికి చట్టబద్ధత బిల్లు (Amaravati Legitimacy Bill) ప్రవేశపెట్టారు. బిల్లుపై గంటసేపు చర్చించేందుకు స్పీకర్‌ ఓంబిర్లా అనుమతి ఇచ్చారు. అమరావతికి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతునిస్తుందని ఆ పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్‌ ప్రకటించారు. రాజధాని అమరావతికి కేంద్రం సంపూర్ణంగా సహకరించాలని కోరారు. రాజధాని అమరావతికి తగినన్ని నిధులు అందించాలని, ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించాలని కోరారు. విశాఖ ఉక్కును కేంద్రం ఆదుకోవాని, విశాఖలో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధికి సహకరించాలని మాణికం ఠాగూర్‌ కేంద్రానికి సూచనలు చేశారు.

అమరావతి బిల్లుపై లోక్‌సభలో చర్చ దృష్ట్యా టీడీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను (Om Birla) మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే చర్చించాలని విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 12 గం.కు బిల్లు పెట్టిన వెంటనే చర్చకు తీసుకోవాలని కోరారు. జన విశ్వాస్ బిల్లుపై చర్చ తర్వాత అమరావతి బిల్లు (Amaravati Bill) చర్చకు వస్తుందని స్పీకర్ చెప్పినట్లు తెలుస్తోంది.

Read Also: చక్కెర వాడకండి.. కరీంనగర్ వైద్యుడి భావోద్వేగం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>