కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవులను (Sankranti Holidays) విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 10వ తేదీ నుండి జనవరి 16వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ వెసులుబాటు కల్పించారు. సెలవుల అనంతరం జనవరి 17వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలకు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
Read Also: చైనా మాంజా విక్రయం.. సీపీ సీరియస్ వార్నింగ్
Follow Us On : WhatsApp


