కలం, వెబ్ డెస్క్ : ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఈ నెల 9న ఏపీకి రాబోతున్నాడు. సీఎం చంద్రబాబుతో (Chandrababu) ప్రత్యేకంగా భేటీ కాబోతున్నాడు. ఏపీలో క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు సంబంధించిన విషయాలపై ఇద్దరూ చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో యువత స్పోర్ట్స్ ట్యాలెంట్ ను బయటకు తీయడానికి, క్రికెట్ ను ప్రోత్సహించడానికి కావాల్సిన అంశాలపై ఇద్దరూ మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో నిర్వహించే అకాడమీని ధోనీ సారథ్యంలో నిర్మిస్తే యూత్ కు మంచి అవకాశాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ధోనీకి ఉన్న ఇమేజ్, అనుభవంతో క్రికెట్ అకాడమీకి క్రేజ్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
మహేంద్ర సింగ్ ధోనీకి (MS Dhoni) కూల్ కెప్టెన్ గా తిరుగులేని ఇమేజ్ ఉంది. ఇండియాకు 2011 వరల్డ్ కప్ తీసుకొచ్చిన కెప్టెన్ గా క్రెడిట్ ఆయన సొంతం. 2007లో టీ20 వరల్డ్ కప్ అలాగే మూడు ఐసీసీ ట్రోఫీలు, 2013 ఛాంపియన్ ట్రోఫీలు ధోనీ కెప్టెన్సీలో ఇండియా గెలిచింది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు ధోనీ. క్రికెట్ ను ఎంకరేజ్ చేయడం కోసం ధోనీ చాలా సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఏపీకి రాబోతున్నట్టు సమాచారం.
Read Also: ఎంపీపీ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం దౌర్జన్యం : వైఎస్ జగన్
Follow Us On : WhatsApp


