కలం, జనగామ : ఈతకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన.. జనగామ (Jangaon) జిల్లాలో విషాదాన్ని నింపింది. మృతుడు బచ్చన్నపేట (Bachannapet) మండల కేంద్రానికి చెందిన ఎనుగుల ప్రశాంత్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

