కలం, వెబ్ డెస్క్ : ఏలూరు (Eluru) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ కుటుంబంపై యువకుడు గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. జంగారెడ్డిగూడెం (Jangareddygudem) లో ఈ ఘటన జరిగింది. పొలం సరిహద్దు విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వివేక్ అనే యువకుడు తన మేనమామ కుటుంబంపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను జిలుగులమ్మ, చుక్కమ్మగా గుర్తించారు. చుట్టుపక్కల వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: తెలంగాణలో అమెరికా సంస్థ సర్గాడ్ రూ.1000 కోట్ల పెట్టుబడులు
Follow Us On : WhatsApp


