కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ‘యశ్'(Yash) హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్'(Toxic) నుంచి మేకర్స్ మరో పవర్ఫుల్ అప్డేట్ను విడుదల చేశారు. ‘లేడీస్ & లేడీస్'(Ladies and Ladies) పేరుతో విడుదల చేసిన కొత్త ప్రమోషనల్ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ వీడియోలో యశ్ హై-ఇంపాక్ట్ యాక్షన్ అవతార్‌లో కనిపించారు. మరోవైపు కథలో మహిళా పాత్రలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, శక్తివంతమైన మహిళలే ఈ కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్ అప్డేట్స్ సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ పొందగా.. తాజాగా రిలీజ్ చేసిన ‘లేడీస్ & లేడీస్’ వీడియో కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో #Toxic సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకురాలు గీతు మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2026 ఆగస్టు 26న ‘టాక్సిక్’ మూవీని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. వరుస అప్డేట్లతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్న మేకర్స్, త్వరలో మరిన్ని సర్ప్రైజ్లను అందించనున్నారు.

